దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రాలకు కేంద్రం చేసిన సూచనలివే..
- పండగల వేళ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టడానికి నైట్ కర్ఫ్యూలను అమలు చేయాలి. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి.
- కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా పరిగణించాలి. ఆ ప్రాంతాల్లో తగిన నిబంధనలు అమలు చేయాలి.
- బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలి.
- అన్ని జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పాజిటివిటీ రేటు ఎక్కువ ఉన్న జిల్లాలను ఫోకస్ చేయాలి.
- ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యం, అంబులెన్స్, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలి.
- రాష్ట్రంలో వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలి.
- వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలి. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి.
- రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు 100 శాతం వ్యాక్సిన్ పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa