సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తులకు మరో మూడు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో నోటిఫికేషన్ కు సంబంధించి వివరాలు మీకోసం..
*భర్తీ చేయనున్న ఖాళీలు, వాటికి విద్యార్హతలు: 21
-లెవెల్ 5/4 పోస్టులు 3 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి.
-లెవెల్ 3/2 పోస్టులు 18 ఉన్నాయి. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + కోర్స్ ఉన్నవారు యాక్ట్ అప్రెంటీస్‌షిప్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + ఐటీఐ పాస్ కావాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌ను అర్హతగా పరిగణించరు.
*క్రీడల వారీగా కేటాయించిన పోస్టుల వివరాలు:
-బాస్కెట్ బాల్- 2, బాక్సింగ్- 2, హాకీ-2, వాటర్ పోలో-1, అథ్లెటిక్స్-1, బ్యాడ్మింటన్-1, క్రికెట్-2, కబడ్డీ-2, వాలీబాల్-1, వెయిట్ లిఫ్టింగ్-1, రెజ్లింగ్-2 పోస్టులు ఉన్నాయి. ఈ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి.
*అభ్యర్థుల వయస్సు: 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
*దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.250.
*దరఖాస్తులకు చివరి గడువు:2021 డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటల్లోగా
* దరఖాస్తులకు వెబ్‌సైట్ : https://rrccr.com/
*అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి తెలుకోగలరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa