ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడిన ఘటన యూపీలోని కాన్పూర్‌లో జరిగింది. పన్ను ఎగవేశాడన్న ఆరోపణలపై ఆ వ్యాపారి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటి నిండా నోట్ల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.150 కోట్ల నగదు బయటపడిందట.
సోదాలు నిర్వహిస్తుండగా వ్యాపారి ఇంట్లో అనుమానాస్పదంగా 2 అల్మారాలు కనిపించాయి. వాటిలో నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్ తిన్నారు. బ్యాంక్ అధికారులను పిలిపించి 3 కౌంటింగ్ మిషన్లతో డబ్బులను లెక్కించడం ప్రారంభించారు. గురువారం సాయంత్రం నుంచి ఈ నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతుండగా.. శుక్రవారం ఉదయం వరకు రూ. 150 కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.
డీజీసీఐ అధికారులు కూడా పీయూష్ ఇంటికి చేరుకున్నారు. దర్యాప్తులో నకిలీ ఇన్‌వాయిస్‌లు , బిల్లులను సృష్టించారని, జీఎస్‌టీ పన్నులు ఎగ్గొట్టారని తేలింది. కాన్పూర్‌లోని ఇంటితో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌లోని పీయూష్ కు సంబంధించిన పలు కార్యాలయాలు, గోడౌన్లలోనూ తనిఖీలు నిర్వహించారు. ఓ వేర్ హౌస్‌లో నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్న 4 ట్రక్కులను స్వాధీనం చేసుకున్నారు. పీయూష్ కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా సమాజ్‌వాదీ పార్టీ అనుచరుడిగా ఉన్నారు. ఆపార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa