హిందూ సంప్రదాయంలో జయ ఏకాదశి మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వస్తుంది. ఈ సంవత్సరం జనవరి 29న జయ ఏకాదశి ఉపవాసం పాటిస్తారని పండితులు వివరిస్తున్నారు. ఈ రోజున అన్నం, బియ్యంతో చేసిన పదార్థాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటివి తినరాదని, నల్లని దుస్తులు ధరించరాదని, తులసి ఆకులు కోయరాదని, బ్రహ్మచర్యం పాటించాలని, గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.. ఈ నియమాలు పాటించకపోతే విష్ణువు ఆగ్రహానికి గురై, ఉపవాస ఫలాలు దక్కవని, పేదరికం వస్తుందని విశ్వాసిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa