ఏపీ రాజకీయాల్లో త్వరలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ఆవశ్యకతపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో ఎస్సీ, బీసీ నేతలు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సర్వజన సభ జాతీయ అధ్యక్షుడు, ఎస్సీ నాయకుడు ఆర్‌ఎస్ రత్నాకర్‌తో బీసీ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణ రెండు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ ఆవశ్యకతపై ముద్రగడ చర్చించారు. ఈ అంశంపై ముద్రగడ కూడా సానుకూలంగా ఉన్నారని నేతలు తెలిపారు. ఇది ప్రాథమిక ప్రయత్నమని, మరింత లోతైన చర్చలు అవసరమని ఆయన అన్నారు. అన్నీ కుదిరితే ఏపీలో కొత్త రాజకీయ వేదిక రాబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa