అమెరికాలోని కొలొరాడో అడవుల్లో రగలిని కార్చిచ్చు వేగంగా విస్తరిస్తూ అక్కడి స్థానికుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. డెన్వర్ -బౌల్డర్ ప్రాంతాల మధ్య గల...... అటవీ ప్రాంతంలో తొలుత మంటలు చెలరేగగా గంటల వ్యవధిలోనే అది దావాలనంలా మారింది. మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో పాటు... పెద్ద ఎత్తున పొగ గాల్లోకి విడుదల అవుతుండంతో స్థానికులు. ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోతున్నారు. దట్టంగా పొగ ఆవరించడంతో ఆ ప్రాంతం గుండా వెళ్తున్న.వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకు 169 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మంటలు మరింత వేగంగా వ్యాపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంటల్లో 580 ఇళ్లు, ఓ హోటల్ , షాపింగ్ కాంప్లెక్స్ దగ్దమైనట్లు పేర్కొన్నారు. వేలాది మంది ప్రజలు. తమ ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa