అనంతపురం: ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు సంబంధించిన ఇంటి స్థలాన్ని ఓ వ్యక్తి స్వాధీనం చేసుకున్నాడని, దీంతో కలత చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు పుల్లయ్య తెలిపారు. పట్టణ పోలీసులు వివరాలు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa