పంజాబ్ పై పాగా వేయాలనుకొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అందుకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు సమాచారం. మరీముఖ్యంగా ఈ రాష్ట్రంలో పార్టీ విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పది సూత్రాల పథకం అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకొవాలనే లక్ష్యంతో ఉన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ హామీలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం ప్రకటించింది. ఫిబ్రవరి 14న రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగున్నాయి. ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు. కాంగ్రెస్..బీజేపీ తో సహా అన్ని పార్టీలు పంజాబ్ లో అధికారం దక్కించుకోవటం పైన ఆశలు పెట్టుకున్నాయి. ఇక, కేజ్రీవాల్ కొత్తగా 10 సూత్రాలతో పంజాబ్ మోడల్ నినాదంలో ఓటర్లను ఆక్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలతో మమేకమవుతున్నారు. ఉపాధి కోసం కెనడా వెళ్లిన యువత తిరిగి ఇక్కడకే వచ్చి ఉద్యోగం చేసుకునేలా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా కాంగ్రెస్, బాదల్ కుటుంబం మధ్య పొత్తు కొనసాగుతోందని.. వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దిల్లీ సీఎం ఆరోపించారు. దీనికి ముగింపు పలకడానికి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని.. .300 యూనిట్లు వరకు 24/7 ఉచితంగా విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మతవిద్వేషాల కేసుల్లో బాధితులకు న్యాయం.. నిందితులను కఠినంగా శిక్షించడం పైన ప్రజలను ఆకట్టుకొనే హామీలతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చేందుకు ఎన్నికల ప్రకటనతో ప్రజలకు అవకాశం వచ్చిందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రిస్తామన్నారు.రాష్ట్రంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. అవినీతి రహిత రాష్ట్రం తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు. 16,000 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసి.. ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. .విద్య, ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడం.18 ఏళ్లు దాటిన మహిళలకు నెలనెలా రూ.1000 ఇస్తామంటూ గతంలో చెప్పిన హామీని పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa