కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని అందిస్తోంది. ఇది ప్రమాద బీమా స్కీమ్. ఇందులో చేరి ఏడాదికి రూ.12 చెల్లిస్తే రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తుంది. అంటే నెలకు ఒక్క రూపాయి పొదుపు చేస్తే సరిపోతుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ప్రతి సంవత్సరం రూ.12 బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతుంది. మే నెల చివరిలో డబ్బులు అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి. అందువల్ల మీరు ఆ నెలలోనే అకౌంట్ లో రూ.12 కలిగి ఉండాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు.
18 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ఏడాదికి రూ.12 చెల్లిస్తూనే వెళ్లాలి. పాలసీదారుడు మరణిస్తే రూ.2 లక్షలు నామినీ లేదా కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఈ పాలసీ కోసం మీరు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa