ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పటి వరకు జగన్ కు టైమ్ ఇస్తున్నా ఏం చేస్తారో చేసుకోండి : రఘురామ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 01:04 PM

అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు సీఎం జగన్కు టైం ఇస్తున్నా, ఏం చేస్తారో చేసుకోండి అని ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ విసిరారు. రాజధాని విషయంలో మోసం చేసిన ప్రభుత్వంపై రైతులు 8 కేసు పెట్టాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోర్టులో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా బక్యంగా హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలువునిచ్చారు. మాజీమంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో వురోగతి రావొచ్చన్నారు. వైసీపీ నేత శివశంకర్రెడ్డి తరపున ప్రభుత్వ లాయర్ చంద్ర ఓబు డి వాదించారని, ప్రభు త్వ తరపు న్యాయవాది పార్టీకి, నాయకుడి తరవున కేసు ఎలా వాదిస్తారు? అని రఘురామ ప్రశ్నించారు. చంద్ర ఓబుర్రెడ్డిపై బార్ కౌన్సిల్ చైర్మనికి లేఖ రాశానని తెలిపారు. హూ కిల్ బాబాయ్ అనేది ప్రజలందరికీ తెలుసన్నారు. జిల్లాల విభజ న విషయంలో వైసీపీ కేడర్ కూడా మండిపడుతోందన్నారు. డ్రగ్స్ నియంత్రణపై జగన్ సమీక్ష నిర్వహించాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa