ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాపూజీ చూపిన మార్గంలో అందరు నడవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 01:38 PM

గుంటూరు: జాతిపిత, మహాత్మా గాంధీ గారు చూపించిన సత్యం, అహింసా మార్గాములో ప్రతి ఒక్కరూ నడవాలని, మహాత్మా గాంధీ 73 వ వర్ధంతి సందర్భంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా. చదలవాడ అరవింద బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డా. చదలవాడ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అహింసా మార్గములో పోరాటం చేసి విజయం సాధించినది ఒక్క భారతదేశ స్వతంత్ర ఉద్యమము మాత్రమేనని, దానికి కారణం మహాత్మా గాంధీ గారేనని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారని, ఆయన చూపిన బాటలో ప్రభుత్వాలు గ్రామాలను అభివృద్ధి చేయాలని, అదే విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన ఆనాడే చెప్పారని, అంటరాని తనం నిర్ములన కొరకు ఆయన పోరాటం చేసారని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.


ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వాణిజ్య విభాగ అధ్యక్షుడు మాజేటి వెంకటేష్, వనమా శివ, నాగవరపు ప్రసాద్, మైనార్టీ నాయకులు మన్నన్ షరీఫ్, మబు, మీరవాలి, సుభాని, భాష, రఫీ, ఖాసీం సైదు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa