ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యనమలపై విజయసాయిరెడ్డి మండిపాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 30, 2022, 01:56 PM

ఏపీ రాష్ట్ర చరిత్రలో యనమల రామకృష్టుడు అతి చెత్త ఆర్థిక మంత్రి అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై శనివారం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని పాడి రైతులకు మేలు చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమూల్ సంస్థను తీసుకొచ్చారని విజయసాయిరెడ్డి చెప్పారు. కేవలం రైతులే యాజమాన్యంగా ఉన్న సంస్థ ఇదన్నారు. అమూల్‌ ఇప్పటికే మదనపల్లిలో ఒక ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. విజయవాడ, విశాఖపట్నంలో వచ్చే నెలలో ఆ యూనిట్లు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు ఇకపై ఏపీలోనే ఉత్పత్తి అయిన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పనితీరుకు నిదర్శనం ఇదని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా టీనేజర్ల వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచిందని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa