ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. మ‌హిళ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 09:55 AM

గుంటూరు: మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మొక్కు చెల్లించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా రహదారి ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన హృదయవిదారకర సంఘటన ఘటన వారి గ్రామంలో విషాదం నింపింది. అవనిగడ్డ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం మోపిదేవి గురుకుల పాఠశాల సమీపంలో 216 జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదంలో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన తాతా నాగ లక్ష్మి (45) దుర్మరణం పాలయ్యారు.


సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కు చెల్లించేందుకు ఆమె కుటుంబ సమేతంగా వచ్చారు. స్వామికి పాల పొంగళ్లు సమర్పించి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. నాగలక్ష్మి తన మనవడు(కూతురు కుమారుడు) కాటూరి శంకరసిద్ధార్థ, నాగలక్ష్మి కుమారుడు, కోడలు వేర్వేరు దిచక్రవాహనాలపై వెళ్తున్నారు.


గురుకుల పాఠశాల సమీపంలోకి వచ్చే సరికి నాగలక్ష్మి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొంది. ఆమె కింద పడపోగా మెదడుకు బలంగా దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. మనవడు తృటిలో తప్పించుకున్నాడు. ముందు వెళుతున్న కుమారుడు, కోడలు ప్రమాదం చూసి చలించిపోయారు.


టిప్పరు డ్రైవరు పరారిలో ఉన్నాడు. బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అవనిగడ్డ ఎస్ఐ కె. శ్రీనివాసరావు, నాగాయలంక ఎస్ఐ కె.శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని చర్చలు జరిపారు. మృతదేహాన్ని పరీక్ష కోసం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త మాధవరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa