ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 11:07 AM

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రిక్ బస్ మరో బస్సును ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు. కాన్పూర్ లోని టాట్ మిల్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరగగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు.... డీసీపీ ప్రమోద్ కుమార్  తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో..... కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్  కోవింద్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రామ్ నాథ్  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు కాంగ్రెస్  జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం ఘటనపై సంతాపం వ్యక్తంచేశారు. బాధితులు కోలుకోవాలని.... భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్  చేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa