ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత ఏది?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 11:49 AM

కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ప్రజలను సంప్రదించాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి. శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఆదివారం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జిల్లాల ప్రక్రియ శాస్త్రీయంగా లేదని విమర్శించారు.


ప్రభుత్వం జీతభత్యాలు, సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటోందని - ఎద్దేవా చేశారు. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. సీఎం సొంత మనుషులతో వ్యాపారాలు చేయిస్తున్నారని ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు.


గుంటూరు ఛానలను పర్చూరు వరకు పొడిగించి రైతులకు సాగు నీరు ఇవ్వాలని కోరారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉంటే తమ పార్టీ అక్కడ ఉంటుందన్నారు. తొలుత కార్యకర్తలు, అభిమానులు ద్విచక్ర వాహనాల ర్యాలీగా మండపం వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో నాయకులు విజయశేఖర్, విజయకుమార్, రామచంద్ర ప్రసాద్, కిరణ్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa