ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 11:53 AM

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని కొప్పురావూరు గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వీరెళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మండల స్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మండల అధ్యక్షుడు వీరెళ్ళ వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతరం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడిగా సోమిశెట్టి పాండు ను జనసేన పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ సందర్భంగా సోమిశెట్టి పాండు మాట్లాడుతూ గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa