ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జలకళ జియాలజిస్ట్ పై వైసీపీ నేత బూతు పురాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 01:37 PM

అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో జలకళ జియాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ స్వామి పై వైసీపీ మండల కన్వీనర్ మామిళ్ళపల్లి అమర్నాథ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడిన ఆడియో ఒకటి ప్రస్తుతం వాట్సాప్,యూట్యూబ్ లలో హల్ చల్ చేస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన అయినా.. ప్రస్తుత ఈ ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


వివరాల్లోకి వెళితే.. తాజాగా వైసీపీ నేత మామిళ్ళపల్లి అమర్నాథ్ రెడ్డి బూతుపురాణం వెలుగు చూసింది. రాప్తాడు నియోజకవర్గంలోనూ రాజ‌కీయ అల‌జ‌డి చెల‌రేగింది. జియాలజిస్ట్‌ కురుబ నారాయణస్వామిని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అనుచరుడు అమర్నాథ్‌రెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు. ఆ అమర్నాథ్‌రెడ్డి ప్ర‌స్తుతం కనగానపల్లి వైసీపీ మండల కన్వీనర్‌గా ఉన్నారు.


తనకు చెప్పకుండా మండలంలోకి అడుగుపెడతావా అంటూ ఆ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు మగాడివైతే నా మండలంలోకి అడుగుపెట్టు.. నీ సంగతి చూస్తా’ అంటూ జియాలజిస్ట్‌ నారాయణస్వామిని బెదిరించాడు. ఇంకా అస‌భ్య ప‌ద‌జాలం వాడారు. వైసీపీ నేత‌ అమ‌ర్నాథ‌రెడ్డి బెదిరింపుల ఆడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. అస‌లే పీఆర్సీ మంట‌తో ర‌గిలిపోతున్న ప్ర‌భుత్వ ఉద్యోగులు.. ఇప్పుడిలా వైసీపీ నేత‌ల బూతుపురాణంపై మ‌రింత మండిప‌డుతున్నారు.


ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత రాజకీయ పార్టీ నాయకుల కన్నా ప్రభుత్వ అధికారులకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అన్ని వర్గాల వారిని కలుపుకుని విధులు నిర్వహించాల్సిన అధికారులను అసభ్య పదజాలంతో దూషించడం, కొట్టడం చట్టరీత్యా నేరం అని తెలిసినా.. రాజకీయ పార్టీల నాయకులు ఆగడాలు ఆగడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa