అన్ని గుర్తింపు కార్డులను జోడిస్తూ ఒకే డిజిటల్ ఐడీగా రూపొందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ ప్రజల జేబుల్లో బోల్డన్ని కార్డులు ఉంటున్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియక ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్‌పోర్టు వంటివన్నీ మోసుకెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఈ బాధ లేకుండా వీటన్నింటినీ కలిపి ఒకే డిజిటల్ ఐడీగా రూపొందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్ (డిజిటల్ గుర్తింపు పత్రాల సమాకలనం)గా ఓ కొత్త మోడల్ కోసం ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ కార్డులన్నీ జతకట్టి ఒక్కటిగా చేసిన తర్వాత కూడా ఆధార్ నంబరులా దీనికీ ఓ నంబరు కేటాయిస్తారు. ఇదొక్కటి ఉంటే ఎప్పుడు ఏ కార్డు అవసరమైతే ఆ కార్డును వాడుకోవచ్చు. అంతేకాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే ఐడీలన్నీ ఒకే చోట ఉంటాయి. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. త్వరలోనే దీనిని ప్రజాభిప్రాయానికి ఉంచుతారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa