ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 03:32 PM

తూర్పు గోదావరి: కొత్తపేట నియోజకవర్గం ఆలమురు మండలానికి చెందిన కోట దుర్గాప్రసాద్ (వయస్సు 26) గత కొంతకాలంగా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతూ ఒకసారి ఆపరేషన్ జరిగినప్పటికీ కొలుకోలేదు. మరల ఆపరేషన్ కోసం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆలమురు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.


అయన వెంటనే స్పందించి 20,000 రూపాయలు, కొత్తపేట నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన ఆత్రేయపురం జడ్పీటీసీ బోనం సాయిబాబు, రావులపాలెం జడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, కొత్తపేట జడ్పీటీసీ గూడపాటి రమాదేవి ప్రవీణ్, ఆలమూరు జడ్పీటీసీ తోరాటి సీతా మహాలక్ష్మి రాంబాబు, ఆలమూరు పంచాయితీ సర్పంచ్ నాతి లావణ్య కుమార్ రాజా కలిసి తమ వంతుగా 50,000 రూపాయల ఆర్థిక సహాయం కలిపి 70,000 రూపాయలు అందించారు. విజయవాడ హాస్పిటల్ వరకు చిర్ల సోమసుందరరెడ్డి ట్రస్ట్ అంబులెన్స్ ను ఏర్పాటు చేసి మెరుగైన చికిత్స కోసం సెప్టెంబర్23, 2021 వ తేదీన పంపించడం జరిగింది. ఈరోజు కోట దుర్గాప్రసాద్ పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa