ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా నియోజకవర్గం నరసాపురంలోనే నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు: రఘురామ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 05:14 PM

వైస్సార్ సిపి పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ  సీఎం జగన్ మరియు ఏపీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌ కుమార్‌ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటీవల సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రోద్బలంతో ఏపీ సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ నా హత్యకు కుట్ర పన్నారు అని, నా నియోజకవర్గం నరసాపురంలోనే నన్ను హత్య చేసేందుకు జార్ఖండ్‌ నుంచి గూండాలను రప్పించే ప్రయత్నం చేశారు. సీఐడీ చీఫ్‌తో పాటు సీఎం నుంచి కూడా చంపేస్తానని బెదిరింపులు వచ్చాయి’’ అని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
సునీల్ కుమార్ పై ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. సునీల్ కుమార్ వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేశారని రఘురామ పేర్కొన్నారు. వారు మతమార్పిడులకు పాల్పడ్డారని పిటిషన్‌లో పేర్కొన్నారు. భార్యాభర్తల మధ్య వివాదాల్లో తనను టార్గెట్ చేశారని సునీల్ చెప్పాడు. కౌంటర్ దాఖలు చేయాలని సునీల్ కుమార్‌ను ఏపీ హైకోర్టు ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa