ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు సీఎం జగన్ శుభవార్త.!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 31, 2022, 05:27 PM

వైయస్సార్‌ జలకళపై సమీక్ష చేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలని ఆదేశించారు. ఆ రిగ్గు ద్వారా రైతులకు బోర్లు వేయించాలని, దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందని సిఎం జగన్ పేర్కొన్నారు. బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలన్నారు. పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులు చూపినప్పుడు ఆవేదన కలిగిందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అలాంటి పరిస్థితులను మార్చాలని, నివాస ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు. రైతులకు మంచి జరిగేలా అన్నీ చర్యలు ఉండాలని ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలని కోరారు. ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్ల ఏర్పాటుపై సీఎం జగన్ కు అధికారులు ప్రణాళిక వివరించారు. వీటి నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం జగన్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa