విశాఖపట్నం : గొలుగొండ మండలం వెలుగు కార్యాలయంలో ఏపీఎం గా విధులు నిర్వహిస్తున్న గోవిందరావును వలవేసి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు వివరాల్లోకి వెళ్ళగా ఏక దేవి సీఏ ఉద్యోగానికి తనకి బదులుగా తన భర్త అయిన వెంకటరమణ నిర్వహిస్తున్నారు .ఇది అలుసుగా తీసుకొని ఏ పీ ఎం గోవిందరావు తన చేతివాటం ప్రదర్శించారు ఈమెకు మూడు నెలల జీతం 32 వేల రూపాయలు రాగా అందులో 14 వేల రూపాయల ఖర్చుల కు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏక దేవి ఈ విషయమై ఏసీబీ వారికి సమాచారం అందించి రెడ్హ్యాండెడ్గా పట్టించింది. ఈ దాడిలో ఏసీబీ వారు సోదాలు నిర్వహించి సదరు ఉద్యోగిని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డి.ఎస్.పి బి వి ఎస్ ఎస్ రమణమూర్తి వివరించారు .ఈ దాడిలో సిఐలు లక్ష్మణ మూర్తి శ్రీనివాసులు గఫూర్ మరియు రామకృష్ణ పాల్గొన్నారని వివరించారు ఎవరైనా ఎక్కడైనా లంచం అడిగిన అట్లయితే విశాఖపట్నం డి ఎస్ పి ఆఫీస్ ఫోన్ నెంబర్లకు 9440446170 మరియు 14400 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa