ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 12:49 PM

కరోనా కారణంగా గత రెండేళ్లుగా దేశంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైంది. అందుకే ఈ బడ్జెట్‌లో విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థులందరికీ ఈ-కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


పీఎం ఈ-విద్య కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్‌ ఛానళ్లు ఉండగా వీటిని 200 ఛానళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్‌ ఏర్పాటు చేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో తరగతుల బోధన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌, టీవీ, రేడియోల ద్వారా పాఠాలు బోధించనున్నట్లు తెలిపారు.


విద్యార్థులకు ఐఎస్‌టీఈ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రతి విద్యార్థికి అర్థం అయ్యేలా పలు భారతీయ భాషల్లో కోర్సులను ఈ వర్సిటీ అందించనుంది. అలాగే వ్యవసాయ యూనివర్శిటీల్లో సిలబస్‌ మార్పులు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. జీరో బడ్జెట్‌ సాగు, సేంద్రీయ సాగు, అధునాత వ్యవసాయం, వాల్యూ అడిషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలను కొత్తగా చేర్చనున్నట్లు తెలిపారు. సెలబస్‌ మార్పుల కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa