ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 12:59 PM

కృష్ణా జిల్లా, మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం దాములూరు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ గ్రామ, మండల పార్టీ సమక్షంలో వారంతా సైకిలెక్కారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పోకడ, నియోజకవర్గంలోని నాయకుల వ్యవహారశైలిపైనా అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా పార్టీలో చేరుతున్న వారితోపాటు స్థానిక టీడీపీ కార్యకర్తలు కలిసి గ్రామంలో గౌరవ సభ నిర్వహించారు. సోమవారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఉన్న కొందరు ముస్లిం మైనారిటీలు, దళిత సామాజికవర్గానికి చెందిన వారు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తితోపాటు, నియోజకవర్గంలోని ఆ పార్టీ నేతల వైఖరిపై కూడా వారు అసంతృప్తి చెందినట్లు తెలిసింది. తదనుగుణంగా వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోగా సంక్షేమ ఫలాలు అందాలంటే అధికార పార్టీతోనే పయనించాలన్న భావన ప్రజల్లో ఉన్న దశలో అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీ గూటికి చేరడం చర్చనీయాంశమైంది. పార్టీలో చేరిన వారిలో మాజీ ఉపసర్పంచ్ షేక్ ప్యారి, చింతలపాడు బుజ్జి, షేక్ ఇంద్ర, షేక్ నూర్జహ, కోట పుల్లయ్య, పల్లె పోగు శ్రీనివాసరావు, ఇతర వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి నాయకులు జంపాల సీతారామయ్య, మండల టిడిపి అధ్యక్షుడు రామయ్యని రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్ష కార్యదర్శులు చెరుకుమల్లి చిట్టి బాబు, జాన్ సైదా, కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు చుట్టూకుదురు శ్రీనివాసరావు గ్రామ పార్టీ నేతలు నల్లూరి పెద్ద అప్పారావు, ఉప్పులూరు జాన్ బాబు, సుంకర భాస్కరరావు, ఎడ్లపల్లి నాగేశ్వరరావు, అంకరాజు, ఖాజా కొమ్మినేని ఏడుకొండలు, అబ్బూరి శ్రీను, చిన్న అప్పారావు, కరిముల్లా, తమ్మా వీర్ల అంకయ్య, మైక్ బుజ్జి, రామకృష్ణ, నడకుదురు గోపరాజు, పల్లె పోగు గాంధీ, ఉప్పులూరి సూరిబాబు, గొరజాల సాంబశివరావు, పత్రి లేపాక్షి రావు పాగి చిన్న వెంకటేశ్వరరావు, పల్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa