వచ్చే ఐదేళ్లలో మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన.
►ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్
►ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం
►చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం
►క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు
►ట్యాక్స్ రిటర్న్స్ అప్ డేట్ చేసేందుకు రెండేళ్ల సమయం
►సహకార సంస్థల పన్నుపై సర్ ఛార్జి 7% తగ్గింపు
►రిటర్న్స్ లో లోపాల సవరణకు ట్యాక్స్ పేయర్స్ కు అవకాశం
►స్టార్టప్ లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు
►వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు
►పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్ బాండ్లు
►గిఫ్ట్ సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలకు అవకాశం
►స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు
►చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం
►2023 తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటన
►వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa