ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా విడుదల

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 03:14 PM

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-15 వేలం జరగనుంది. తాజా సీజన్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈసారి వేలానికి 590 ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. ఈ వేలంలో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్, ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, కగిసో రబాడా, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, క్వింటన్ డికాక్ లకు గిరాకీ ఉండొచ్చని ఐపీఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


https://www.iplt20.com/news/3721/ipl-2022-player-auction-list-announced






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa