ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ లో మోదీ వరల్డ్ రికార్డు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 01, 2022, 03:15 PM

ప్ర‌ధాని మోదీ మ‌రో ఘ‌న‌త‌ను అందుకున్నారు. మోదీ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు తగ్గేదే లేదంటూ సెలబ్రిటీలతో పోటీ పడుతూ మరీ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. మోదీకి మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చాలా మంది సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఆయనను అభిమానిస్తారు. సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటారు. ప్రపంచంలోనే అత్యధిక పాపులారిటీ ఉన్న నేతగానూ మోదీ ఉన్నారు. ఇదే క్రమంలో వీడియో ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ లోనూ ప్రధాని మోదీ చానెల్ తాజాగా రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో ఇప్పటివరకు ఏ దేశాధినేతకు దక్కని రికార్డు సృష్టించింది. మంగ‌ళ‌వారం నాటికి ‘నరేంద్ర మోదీ’ పేరుతో ఉన్న ప్రధాని అధికారిక యూట్యూబ్ చానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది. ఈ విషయాన్ని ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ ట్విట్టర్ లో ప్రకటించింది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అగ్ర నాయ‌కుల యూట్యూబ్ ఛానెళ్ల సబ్‌స్క్రైబర్ల సంఖ్య‌ను గ‌మనిస్తే మోదీనే టాప్‌లో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa