వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై బడ్జెట్‌లో స్వల్పంగా మోడీ సర్కార్ నిధులను పెంచింది. 2021-22 సంవత్సరంలో రూ.1,47,764 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ.1,51,521 కోట్లకు పెంచారు. మరోవైపు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి బడ్జెట్ కేటాయింపులో స్వల్ప పెరుగుదల కనిపించింది. దీని కోసం 2021-22లో 65000 కోట్లు కేటాయించగా, 2022-2023కి రూ.68000 కోట్లకు పెంచారు. మరోవైపు ఫసల్ బీమా పథకానికి రూ.15500 కోట్లు కేటాయించారు. ఎరువులకు సబ్సిడీగా 2022-23లో రూ.105222 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో రైతులకు చౌకగా ఎరువులు అందే మార్గం సుగమమవుతుంది. అయితే ఈ ఏడాది కూడా ఈ సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించలేదు. అంటే ఎరువుల కంపెనీలకు ఈ మొత్తం సబ్సిడీ ఇవ్వనుంది. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం బడ్జెట్ రూ. 134420 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వం 2022-23లో వ్యవసాయానికి రూ.1,51,521 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేసింది. కాగా, 2013-14 సంవత్సరంలో వ్యవసాయ శాఖకు బడ్జెట్‌లో రూ.21,933.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు దానికంటే మూడు రెట్లు ఎక్కువ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa