ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మహమ్మారి వల్ల పర్యావరణానికి ఆ డేంజర్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 03:20 PM

కరోనా మహమ్మారి వల్ల చాలా మంది ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కరోనా వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కలిగాయని మనకి తెలుసు. కానీ దాని వల్ల మెడికల్ వేస్ట్ చాలా ఎక్కువగా వచ్చిందట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ చెత్త వల్ల మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని, అలానే పర్యావరణం కూడా దెబ్బతింటుందని చెప్పింది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ఎంతో మంది ఆందోళన చెందారు. కరోనా సమయంలో సిరంజిలు, టెస్ట్ కిట్స్, వ్యాక్సిన్ బాటిల్స్ ఇలా ఎన్నో వాటిని ఉపయోగించారు. వీటి వల్ల చాలా చెత్త పేరుకు పోయింది. అలానే చాలా వరకు ప్లాస్టిక్ కూడా దీని వల్ల వచ్చింది. యుఎన్ 87 వేల టన్నుల పీపీఈ కిట్ల చెత్త నవంబర్ 2021లో ఉండొచ్చని చెబుతోంది. 140 మిలియన్ టెస్ట్ కిట్స్ వేస్ట్ వచ్చిందని సమాచారం. 144000 బాటిల్స్, సిరంజిలు నీడిల్స్ మరియు సేఫ్టీ బాక్స్ల ద్వారా చెత్త వచ్చింది. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మహా సముద్రంలో కలుస్తుందని అన్నారు. అలాగే కరోనాకి సంబంధించి ప్లాస్టిక్ వేస్ట్ చెరువుల్లోకి, సముద్రాల్లోకి వెళ్తోందని అన్నారు. ఈ చెత్త వలన మనుష్యుల ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి కూడా హాని ఉంటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa