ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీతో టెన్నిస్ స్టార్ నాదల్ కు ప్రత్యేక అనుబంధం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 03:23 PM

21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గి తానేంటో మరోసారి నిరూపించాడు స్పెయిన్ టెన్నిస్ బుల్ రఫెల్ నాదల్. మొన్న జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ లో దిమిత్రీ మెద్వదేవ్ పై గెలిచి చరిత్ర సృష్టించాడు. బుల్ అని రఫాను ముద్దుగా పిలిచినా అతడు చాలా సున్నిత మనస్కుడట. ఫుట్ బాలర్ గా ఎదగాల్సిన వాడు రాకెట్ చేతబట్టి సక్సెస్ కొడుతున్నాడు. అంతేకాదండోయ్ నాదల్ కు ఆంధ్రప్రదేశ్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. అనంతపురంలోని పేద పిల్లలకు టెన్నిస్ ను మరింత చేరువ చేసేందుకు 2010లో ‘నాదల్ ఎడ్యుకేషనల్ టెన్నిస్ స్కూల్’ను ఏర్పాటు చేశాడు. స్పెయిన్ కు చెందిన ఫెర్రర్ అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో గ్రామీణాభివద్ధి ట్రస్ట్ ను నిర్వహిస్తున్నాడు. దాని గురించి తెలుసుకున్న నాదల్ ఆ ట్రస్ట్ సహకారంతోనే అనంతపురంలో టెన్నిస్ స్కూల్ ను ప్రారంభించాడు. ఆ స్కూల్ ను తన తల్లి అన్నా మరియా చేతుల మీదుగానే రఫా ప్రారంభించాడు. గ్రామీణ ప్రాంతీల్లోని పిల్లలకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. క్రీడా పరికరాలను అందిస్తున్నారు. తర్వాత ఈ స్కూల్ ను స్పెయిన్ లోనూ విస్తరించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa