ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 03:43 PM

రాష్ట్ర స్థూల ఆర్థిక ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో మత్స్య పరిశ్రమ ప్రోత్సహిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. బుధవారం ఆముదాలవలస మండలం లోని రామచంద్రాపురంలో లో గల సాగరం చెరువు లోచేప పిల్లల పెంపకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థూల ఆర్థిక ఆదాయాన్ని పెంచాలని ఉద్దేశంతో మత్స్య పరిశ్రమ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమీకృత నీటిపారుదల మరియు వ్యవసాయ పరివర్తన పథకం ద్వారా సుమారు 31500 మంచినీటి రొయ్య పిల్లలను పంపిణీ చేసి రామచంద్రపురం సాగరం చెరువు లో పిల్లలను బుధవారం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్స్య పరిశ్రమ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానికంగా ఉన్న మత్స్యకారులను ప్రోత్సహించి మత్స్య పరిశ్రమ పై ఉపాధి పెరగాలని ఉద్దేశంతో రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ చేప పిల్లలను పశ్చిమగోదావరి జిల్లా నుండి తీసుకువచ్చి 100% రాయితీపై అందిస్తున్నామని తెలియజేశారు. మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్స్ లు, లైట్లు, చేప పిల్లలు, రొయ్య పిల్లలు ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో 973 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉందని దానిని అభివృద్ధి పరిచి మత్స్య సంపదను వెలికి తీసి విదేశాలకు పంపించడం ద్వారా ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎంపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామమూర్తి, సరుబుజ్జిలి ఎంపీపీ ప్రతినిధి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ సింహాచలం మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మత్స్యకార జె. డి శ్రీనివాస రావు, ఏ డి సంతోష్ కుమార్, అభివృద్ధి అధికారి సురేష్ కుమార్, వి ఎఫ్ ఏ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa