పెట్టుబడులు పెట్టేటప్పుడు నష్టాలు కూడా రావొచ్చు. నష్టం, రాబడికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. నష్టం లేకుండా మంచి రాబడిని సాధించలేం అనేది అర్థం చేసుకోవాలి. ఒక పథకానికి నష్టభయం ఉందంటే అందులో అధిక రాబడి వచ్చేందుకు కూడా వీలుంటుంది.
పెట్టుబడి పథకం తీరు ఆధారంగా రకరకాల నష్టభయాలుంటాయి. ఫండ్ మేనేజర్లు నష్టభయాన్ని బేరీజు వేసుకునేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తారు. సాధారణ మదుపరులకు అంత అవగాహన ఉండదు. ఒకే తీరు పెట్టుబడి పథకాలకు ఒకే తరహా నష్టభయం ఉంటుందనే భావనా ఉంటుంది. కానీ ప్రతి పథకానికీ వేర్వేరు పరిస్థితుల్లో అనేక నష్టభయాలు ఉంటాయి.
సాధారణంగా ఫండ్ పథకాలను వాటి నష్టభయాల ఆధారంగా తక్కువ నష్టభయం, సాధారణం-మధ్యస్థం, మధ్యస్థం, మధ్యస్థం-అధికం, అధికం-మరీ అధికం అనే రకాలుగా విభజిస్తారు. దీనినే ఫండ్ రిస్కో మీటర్ అనీ పేర్కొంటారు. మార్కెట్ విలువ, హెచ్చుతగ్గులు, నగదుగా మార్చుకునే వీలు తదితర అంశాల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. పెట్టుబడిదారులు ఫండ్లను ఎంచుకునేటప్పుడు ఈ రిస్కోమీటర్ ను గమనించాలి. మీ నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా ఫండ్ లను సెలెక్ట్ చేసుకోవాలి.
మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో వెళ్లవు. చాలా మంది మార్కెట్ పతనం అవుతుంటే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, పెరుగుతుంటే మదుపు చేయడం చేస్తుంటారు. ఇది దీర్ఘకాలంలో పెట్టుబడులకు నష్టం కలిగిస్తుంది. స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు సహజం అనే విషయాన్ని మదుపరులు అర్థం చేసుకోవాలి.
నష్టభయం, రాబడి ఆధారంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. అధిక నష్టభయం ఉన్న పథకం హెచ్చుతగ్గుల్లోనూ మంచి రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొన్ని ఊహించని నష్టభయాలు వస్తుంటాయి. వీటికీ సిద్ధంగా ఉండాలి. మంచి ప్రణాళిక, అవగాహనతోనే మంచి లాభాలు ఆర్జించే వీలుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa