ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీతాలు తగ్గలేదు , దయచేసి చర్చకి రండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 11:19 AM

పీఆర్సీ వల్ల ఏ ఒక్క ఉద్యోగి వేతనమూ తగ్గలేదు. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దు. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ అయిన జీతాలను పరిశీలించుకుంటే తగ్గాయో పెరిగాయో వారికే అర్థమవుతుంది. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబట్టడం సరికాదు. మిగతా అంశాల పరిష్కారానికి ముందుకు రావాలి. ఆ 3 డిమాండ్లకు కాలం చెల్లింది. ఇప్పటికే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేశాం. మిగతా రెండు డిమాండ్లు నెరవేర్చడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశం లేదు.  సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలను సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆహ్వానించారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి సమస్యను పక్కదారి పట్టించే అవకాశం ఉందని హెచ్చరించారు.- సజ్జల రామకృష్ణారెడ్డి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa