పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా కొనసాగుతోంది.
తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా తాము తగ్గేదే లే అన్న ఉద్యోగులు చెప్పిన విధంగానే విజయవాడకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విజయవాడకు వచ్చే రోడ్లపై ఎన్నో చెక్ పోస్టులు పెట్టి ఉద్యోగులను అడ్డుకున్నా, నగరానికి వస్తున్న వాహనాలను తనిఖీలు చేసినా... వేలాది మంది ఉద్యోగులు పోలీసుల కళ్లుకప్పి నగరంలోకి ప్రవేశించారు.
ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. మహిళా ఉద్యోగులు సైతం పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటున్నారు. మరోవైపు నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు (Police deploy forces to prevent 'Chalo Vijayawada) విశ్వప్రయత్నం చేస్తున్నారు. వారిని దాటుకుంటూనే ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. 'సీఎం డౌన్ డౌన్, నల్ల జీవోలు వెనక్కి తీసుకోవాలి, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, వీ వాంట్ జస్టిస్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి' అంటూ వారు నినదిస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి వచ్చిన ఉద్యోగులు శారద కళాశాల సమీపంలో బీఆర్టీఎస్‌కు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులకు చిక్కకుండా శారదా కాలేజీ సమీపంలోని శివరామయ్య క్షేత్రానికి చేరుకున్నారు. తాము బీఆర్టీఎస్‌కు చేరుకున్నామని తమను ఎవ్వరు అడ్డుకోలేరని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చీకటి జీవోలను రద్దు చేసి నివేదిక ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవంటూ విజయవాడకు చేరుకుంటున్న ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa