ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర బడ్జెట్ లో విద్యకు తీవ్ర అన్యాయం: ఏఐఎస్ఎఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 02:23 PM

బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ లో విద్యకు తీవ్ర అన్యాయం జరిగిందిని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రూరల్ మండలంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు ముందు బడ్జెట్ పత్రాలు కాల్చి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంధర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి జిల్లా ఉపాధ్యక్షులు కుల్లాయస్వామి మాట్లాడుతూ విభజన చట్టంలో జిల్లాకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి బడ్జెట్లో 50 కోట్లు కేటాయించడం అక్కడ పనిచేస్తున్న ప్రొఫెసర్ల జీతాలు కూడా సరిపోవని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టాలంటే అప్పటిలో దాదాపు 1500 కోట్లతో కొటేషన్ కూడా వేయడం జరిగిందన్నారు. రాష్ట్రాలకు దేశాలకు విద్యార్థులను అందిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీకి తక్షణమే నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణాలు చేపట్టి విద్యార్థి సమస్యలను తీర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పడం జరిగిందిన్నారు. ఒక్క జాతీయ విద్యా సంస్థకి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గంన్నారు. దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) లో 6 శాతం నిధులు విద్యకు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పిన నేడు బడ్జెట్ లో 3. 2% మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ బడ్జెట్ లో రాబోయే ఐదు సంవత్సరాలలో 60 లక్షల ఉద్యోగాలు కోసం కృషి చేస్తామని చెప్పడం దేశ యువతను, నిరుద్యోగులను మోసం చేయడమే లక్ష్యంగా పని పెట్టుకున్నారు.


ఉన్న యూనివర్సిటీలకు దిక్కు లేకపోతే కొత్తగా డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల ఫెలోషిప్ ల గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యకు పెద్దపీట వేయాలని, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కేటాయించి తత్వరగా నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు వేణు నవీన్ నాయకులు లోకేష్ రెడ్డి సాయి శేఖర్ శేషు శివ ప్రసాద్ బాలకృష్ణ ఉపేంద్ర దివాకర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa