ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యమం చేస్తే ఉద్యోగుల అరెస్ట్ సరి కాదు.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 02:48 PM

చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నాను.ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా?విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సిఎం జగన్ సమాధానం చెప్పాలి.రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాలి..నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలి.లక్షల ఉద్యోగుల సమస్యపై అహంకారంతో కాకుండా...ఆలోచనతో స్పందించాలి.ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా?ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా..రాష్ట్రంలో భాగస్వాములు కాదా?రాజకీయపక్ష నేతలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ‌ నిర్భంధాలు సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం... విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమే. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్...ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారు.ఉద్యోగుల‌ను అగౌర‌ప‌రిచే...ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తీసే విధానాన్ని జ‌గ‌న్ ఇప్ప‌టికైనా వీడాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాము.కానీ జగన్ సర్కార్ లా....ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి....ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంటూ టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు తెలియ చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa