ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో హై టెన్షన్ వాతావరణం... కదం తొక్కిన ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 02:35 PM

ఆంధ్రప్రదేశ్‌ గతకొన్ని రోజులుగా పీఆర్సీ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరుగుతున్న యుద్దం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా పలుమార్లు అధికారులతో, నాయకులతో చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో గురువారం చలో విజయవాడ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా నేడు ఉదయం నుంచి పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు చలో విజయవాడ సమ్మెకు వేలాది మంది సమ్మెలో పాల్గొనడానికి తరలి వస్తున్న నేపథ్యంలో విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. 13 జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు కదిలిరావడంతో పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులకు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి పోలీసులు నాయకులను, ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి, పలు విధాల ఆంక్షలు విధించిన తాము వెనకకు తగ్గిదేలే అంటూ విజయవాడ సభకు భారీగా తరలివచ్చారు.


 


ఉదయం 5 గంటల నుంచి విజయవాడ వ్యాప్తంగా చెక్ పోస్టులు పెట్టి, వాహనాలను తనీఖీ చేస్తున్న వారి కళ్లుకప్పి ఉద్యోగులు నగరంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ నల్ల జీవోలు వెనక్కి తీసుకోవాలని, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం – దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటు పలు నినాదాలు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa