ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక కపిల హోటల్ ఎదురుగా రాకేష్(18) విద్యుత్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కరెంటు కార్మికులుగా పనిచేస్తున్న కొండలు కుమారుడు రాకేష్ కరెంటు పని నిమిత్తం ఓ కొత్త ఇంటి నిర్మాణం వద్ద పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టి కొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక వివరాలు తెలియవలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa