ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.30 కోసం దారుణం..!

national |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 03:30 PM

30 రూపాయలు ఇవ్వలేదని ఓ దర్జీ ఓ వ్యక్తిపై కత్తెరతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ముంబైలోని అంధేరి ప్రాంతంలో మంగళవారం జరిగింది. హరీష్ టకార్ అనే దర్జీ వద్దకు రోహిత్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం ప్యాంటును మార్చి కుట్టాలని తీసుకొచ్చాడు. రూ.100 ఇస్తానని మాట్లాడుకున్నాడు. మరుసటి రోజు ప్యాంటు కోసం రోహిత్ వెళ్లాడు. రూ.30 అదనంగా ఇవ్వాలని హరీష్ అడిగాడు. రోహిత్ ఇవ్వను అని అనడంతో గొడవ మొదలైంది. ప్యాంటు తీసుకుని వెళ్తున్న రోహిత్ పై హరీష్ కత్తెరతో దాడి చేశాడు. రోహిత్ కు తీవ్రగాయాలయ్యాయి. ఇప్పుడు అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు హరీష్ ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa