ఓల్డ్ గుంటూరు జిన్నా టవర్ వద్ద జరిగిన జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, జియా ఉద్దిన్, చంద్రగిరి ఏసురత్నం, రాము, ఇతర వైస్సార్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
హోం మంత్రి మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్చా, స్వతంత్ర్యాలను అనుభవిస్తున్నాము. గుంటూరు నగరంలో జిన్నా టవర్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. జిన్నా టవర్ కట్టే సమయానికి ఇక్కడ చాలా మంది పుట్టి వుండరు.
స్వాతంత్రాన్ని ముందు భారత ప్రజల ఐక్యతకు చిహ్నంగా జిన్నా టవర్ ను నిర్మించడం జరిగింది. భారత సరిహద్దుల్లో వీర జవాన్ లు కాపలా ఉండటం వలనే మనమందరం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాము. ఈ జవాన్ లలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్, సిక్కులు లు ఇలా ప్రతి ఒక్కరూ వుంటారు.
జిన్నా టవర్ విషయాన్ని బీజేపీ రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూడటం భాదకరం, సిగ్గుచేటు. మానవాళికి మంచి చేసిన వారిని స్మరించుకోవడం మన భారతీయులకు అలవాటు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa