విజయవాడ కేంద్రంగా నూతనంగా ఏర్పడుతున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కు ఏమాత్రం రుచించడం లేదని వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గిరిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఎన్టీఆర్ పై ప్రేమ ఏపాటిదో అర్థం అవుతుందన్నారు. అవమానకర రీతిలో ఎన్టీఆర్ వద్దనుండి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడుకి తన కింద పనిచేసే ఆ పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ పై ఎటువంటి గౌరవం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల హామీల లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి విజయవాడ కేంద్రంగా ఏర్పడుతున్న నూతన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం అభినందనీయమనన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa