ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి నెలాఖరు లోపు ఖాళీ పోస్టులను భర్తీ చేయండి: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 08:41 PM

కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌ పై సీఎం జగన్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి నెలాఖరుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని ఖాళీలను భర్తీచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నాడు - నేడు కింద చేపట్టిన పనులు, వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణ ప్రగతిని సీఎం సమీక్షించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టి పెట్టి, ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను భర్తీచేయాలని సీఎం ఆదేశించారు.
గిరిజన ప్రాంతాల్లో డాక్టర్లు అక్కడ ఉండి సేవలను అందించడానికి ఎలాంటి ప్రతిపాదన చేసినా గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తానని సీఎం వెల్లడించారు. ఫిబ్రవరి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో పూర్తిగా ఖాళీలను భర్తీచేయాలని సీఎం అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పష్టంగా మార్పులు కనిపించాలని సీఎం స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa