ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మె వల్ల పరస్పరం నష్టం , ఎవరికీ ప్రయోజనం ఉండదు : సీఎస్ సమీర్ శర్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 10:11 PM

ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మ ఉద్యోగులు తమ జీతాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అసలు జీతాలు ఎక్కడ తగ్గాయో చెప్పాలి అని ఆయన అన్నారు. ఏ సమస్య వచ్చినా తమకు చెబితే తెలుస్తుంది అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.పే స్లిప్ లో 10 రకాల అంశాలను పొందుపరిచారని, వాటన్నింటిని పరిశీలిస్తే వేతనాలు పెంచిన విషయం తెలుస్తుందన్నారు. కావాలంటే కొత్త పిఆర్‌సిని పాత పిఆర్‌సితో పోల్చి చూడవచ్చు అని సమీర్ శర్మ అన్నారు. ఇంకా హెచ్‌ఆర్‌ఏపై సమస్యలుంటే ప్రభుత్వంతో మాట్లాడాలని సీఎస్ సూచించారు. తెలంగాణలో కాకుండా డీఏకు బదులు ఐఆర్ ఇచ్చామని తెలిపారు. సమ్మె చేయకుండా సానుకూలంగా ఆలోచించి చర్చలకు రావాలని ఉద్యోగులకు సీఎస్ పిలుపునిచ్చారు. సమ్మె వల్ల పరస్పరం నష్టమని, ఎవరికీ ప్రయోజనం ఉండదని అయన తెలిపారు. ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa