ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శశికళ తో విజయశాంతి భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 12:01 AM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ తో ఫైర్ బ్రాండ్ బిజెపి నాయకురాలు విజయశాంతి భేటీ అయ్యారు. చెన్నైలోని శశికళ నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని సమాచారం. ఈ  సందర్భంగా జయలలితతో తన జ్ఞాపకాలను ‘రాములమ్మ’ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ అరెస్టై పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనూ విజయశాంతి ఆమెను కలిశారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అప్పట్లో విజయశాంతి వ్యాఖ్యానించారు. చిన్నమ్మ తనకు తల్లిలాంటిదని, తాను ఆమెకు కుమార్తె లాంటిదానినని విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందంటూ శశికళతో భేటీ అయిన ఫొటోలను షేర్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa