ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి వణికిన ఇండోనేషియా

international |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 03:14 AM

ఇండోనేషియాకు భూకంపాలు వెంటాడుతున్నాయి. మరోసారి ఇండోనేషియాను భారీ భూకంపం వణికించింది. మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూంకప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదయినట్టు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. తూర్పు ప్రావిన్సులు మలుకులోని భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 127 కిలోమీటర్లు లోతులో ఉన్నట్టు గుర్తించారు. భూ ప్రకంపనలతో భయాందోళనకు గురైన ప్రజలు నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ఎలాంటి సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. కెపులావన్ బరాత్ దయా వద్ద బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు ఇండోనేషియా క్లైమేటాలజీ వెల్లడించింది. ఇండోనేషియాలో తరుచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. జనవరి 19న కూడా 5.5 తీవ్రతో ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. అమాహైకి తూర్పున 219 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa