నేటి సమాజంపై సినిమాల ప్రభావం అధికంగా ఉంటోంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా సినిమాలకు ఆకర్షితులవుతున్నారు. సినిమాను స్ఫూర్తిగా తీసుకుని మంచి పనులే కాకుండా, భారీ నేరాలకూ పాల్పడుతున్నారు. దొంగతనాలు, మోసాలు చేస్తూ, నేరస్తులుగా మారుతున్నారు. చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాలపాలవుతున్నారు.
ఇటీవల పుష్ప సినిమాలో స్మగ్లర్‌గా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో విడుదలై భారీగా డబ్బులు రాబట్టింది. అచ్చం ఆ సినిమా స్టైల్‌లో పుష్పరాజును ఆదర్శంగా తీసుకున్నాడో ఘటికుడు. పుష్ఫ సినిమాలో మాదిరిగా కర్నాటకలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశాడు. కానీ సినిమాలో చూపించినట్లుగా కాకుండా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. ఖాకీలకు అడ్డంగా దొరికిపోయాడు. అచ్చం పుష్ప సినిమాలోలాగే కూరగాయల లారీలో ఎర్రచందనం దుంగలను గుట్టు చప్పుడు కాకుండా తరలించేశాడు. కర్ణాటక పోలీసులు అనుమానంతో తనిఖీలు చేయగా పట్టుబడ్డాడు. లారీలో సుమారు రూ.2.5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ అభినవ పుష్పరాజు కటకటాలు లెక్కపెడుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa