ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు.. కీలక ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 11:51 AM

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాళీల వివరాలను కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్రసింగ్‌ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2020 మార్చి 1 నాటికి 8,72,243 పోస్టులు ఖాళీగా ఉండగా, 2019 మార్చి 1నాటికి 9,10,153 పోస్టులు ఖాళీగా ఉండేవన్నారు. 2018 మార్చి 1 నాటికి ఈ సంఖ్య 6,83,823గా ఉండేదని లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ, ఆర్‌ఆర్‌బీ ద్వారా 2018-19, 2020-21 లో 2,65,468 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు. యూనియన్‌ గవర్నమెంట్‌ సర్వీసుల్లో 21,255 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జితేంద్రసింగ్‌ తెలిపారు. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించే యూపీఎస్సీలో 485 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa