ద్విచక్ర వాహనం పై గుంటూరు కు వెళుతూ జారిపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. రావెల గ్రామానికి చెందిన కర్రీ అన్నయ్య(43) అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన కొడుకు సంగీత రావు గురువారం సాయంత్రం చికిత్స నిమిత్తం ద్విచక్రవాహనంపై గుంటూరు ఆస్పత్రికి వెళుతున్నారు. రావెల దాటిన వెంటనే అన్నయ్య జారి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు వెంటనే కొడుకు ఆటోలో ఆయనను చికిత్స నిమిత్తం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్నయ్య శుక్రవారం మరణించారు. మృతుడి భార్య రత్నకుమారి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటాద్రి వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa