ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..

national |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 11:15 AM

జమ్మూకశ్మీర్‌లో యాంటీ టెర్రర్‌ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.శ్రీనగర్‌లోని (Srinagar) జకురా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య శనివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter) లో ఇద్దరు లష్కరే తోయిబా/ టీఆర్‌ఎఫ్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని ఇఖ్లాక్ హజామ్‌గా గుర్తించారు. ఇటీవల అనంత్‌నాగ్‌లోని హసన్‌పోరాలో హెడ్ కానిస్టేబుల్ అలీ మహమ్మద్ ఘనీని హతమార్చడంలో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు (JK) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. 2 పిస్టల్స్‌ సహా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజిపి తెలియపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa