ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు వేక్సినేషన్ వేగవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 05, 2022, 11:35 AM

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖాధికారులు వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం పొన్నూరు పట్టణంలో 15 సంవత్సరాల నుంచి 18సంవత్సరాల విద్యార్థులకు వేక్సినేషన్ రెండో డోసు కార్యక్రమం జరుగుతుంది.


ప్రభుత్వం 15 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఆదేశాల మేరకు సంబంధిత ఎఎన్ఎంలు, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వెళ్ళి రెండో డోసు వ్యాక్సిన్ వేస్తున్నారు. 15-18 సంవత్సరాల పిల్లలకు కోవ్యాగ్జిన్ వేయాలన్న ప్రభుత్వాదేశాల మేరకు వ్యాక్సినను ఇస్తున్నారు. ఎన్ఎన్ టి పబ్లిక్ స్కూల్ లో తొమ్మిది, పది తరగతులు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు.


ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కొలిపర్తి శివనాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి విద్యార్థి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు వ్యాక్సిన్ కూడా తీసుకోవాలని కోరారు. 15 సంవత్సరాలు వచ్చిన ప్రతి విద్యార్థికి తమ పాఠశాలలో వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆరోగ్య కార్యకర్తల సేవలను నాగేశ్వరరావు కొనియాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa